తెలంగాణలో మరో 453 కరోనా పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 41,310 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 134 కొత్త కేసులు
  • ఇంకా 6,746 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,310 కరోనా పరీక్షలు నిర్వహించగా, 453 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 134 కొత్త కేసులు వెలుగు చూశాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33, రంగారెడ్డి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,380 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గత ఒక్కరోజు వ్యవధిలో కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,85,596 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,74,742 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,746 మంది చికిత్స పొందుతున్నారు.

Telangana
Corona Virus
Bulletin
Full Details
Today Cases

More Telugu News